దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్ సల్మాన్ వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సంయుక్తంగా నిర్మించారు. ఈనెల 14 విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల అద్భుతమైన రెస్పాన్స్‌తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. రానా దగ్గుబాటి మాట్లాడుతూ,’ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్నిచ్చింది. ముఖ్యంగా పెర్ఫార్మెన్స్‌లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దుల్కర్ కెరీర్‌లో ఫైనస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు.
మ్యూజిక్, విజువల్స్ టెక్నికల్ వ్యాల్యూస్ గురించి చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూ ఉన్న సినిమా ఇది’ అని తెలిపారు. ‘ఇది నా ఫస్ట్ తమిళ్ సినిమా కూడా. ఈ సినిమా అవకాశం రావడం అనేది అదష్టంగా భావిస్తున్నాను. అంత మంచి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా 100% ఇవ్వాలి. డైరెక్టర్ సెల్వ సపోర్ట్‌తో ప్రతి లైన్‌ని క్షుణ్ణంగా నేర్చుకున్నాను. ద బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. నా పర్ఫార్మెన్స్ ఆడియన్స్‌కి నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం ఆరు నెలలు చెన్నైలోనే ఉన్నాను. అలాగే ఈ చిత్రం కోసం సావిత్రి, శ్రీదేవి చేసిన చాలా సినిమాలు చూశాను. తమిళం, తెలుగులో రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఇంత మంచి రెస్పాన్స్‌ని నేను ఊహించలేదు’ అని నాయిక భాగ్యశ్రీ బోర్సే చెప్పారు.
‘కాంత’కి విశేష ప్రేక్షకాదరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



