Thursday, November 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమా జీవితాల్లో 'కాంత' చాలా స్పెషల్‌

మా జీవితాల్లో ‘కాంత’ చాలా స్పెషల్‌

- Advertisement -

దుల్కర్‌ సల్మాన్‌ నటించిన పీరియాడికల్‌ డ్రామా ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకుడు. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌. దుల్కర్‌ సల్మాన్‌ వేఫేర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ఈనెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా దుల్కర్‌ సల్మాన్‌, రానా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

బయోపిక్‌ కాదు : రానా
‘ఇది బయోపిక్‌ అని అందరూ అడుగుతున్నారు. కానీ ఇది కంప్లీట్‌గా ఫిక్షనల్‌ కథ. ఇప్పుడు స్టూడియోలో ఏదైనా జరిగితే ఇమ్మీడియట్‌గా అందరికీ తెలిసిపోతుంది. కానీ ఇలాంటి కథలు చాలా జరిగాయి. చాలా తక్కువ మందికి తెలిసేవి. ఆ కాలం నుంచి ఇన్స్పిరేషన్‌ పొంది రాసిన కథ. ఇది ఒక ఇన్సిడెంట్‌ అని చెప్పలేం. డార్క్‌ సైడ్‌ ఆఫ్‌ గ్రేట్‌ పీపుల్‌ అని చెప్పొచ్చు. ఒక ఇద్దరు గొప్ప వ్యక్తులు, వాళ్ళ ఆర్టిస్ట్‌ బ్రిలియన్స్‌ కోసం గొడవలు పడిన నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది ఎవరి తాత, నాన్నల కథ కాదు(నవ్వుతూ). 50ల బ్యాక్‌ డ్రాప్‌ని ఎంచుకోవడానికి కారణం ఉంది. ఆ కాలంలో లిటరేచర్‌, మ్యూజిక్‌కి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది. ఈరోజు షార్ట్‌ కంటెంట్‌లో ఉన్నాం, ఏ మ్యూజిక్‌ ఏ సాహిత్యమైన ఓకే అన్ని సర్దుకుపోతున్నాం. కానీ ఆ కాలంలో అలా ఉండేది కాదు. పర్ఫెక్షన్‌ ఉండేది.

ఆ టైంలో జరిగిన కథ అంటే తెలియని రొమాన్స్‌ వస్తుంది. ‘కాంత’ మ్యూజిక్‌ కూడా ఒక డిస్కవరీ. ఇది 50లో జరిగే సినిమా. ఆ టైంలో మ్యూజిక్‌లా ఉండాలి. ఈ కాలం ఆడియన్స్‌ కూడా నచ్చాలి. అలా వర్క్‌ చేయడం నిజంగా ఛాలెంజింగ్‌. ఈ సినిమాలో పాటలు, బీజీఎం చాలా అద్భుతంగా ఉంటాయి. నాకు, దుల్కర్‌కి ఈ సినిమా చాలా స్పెషల్‌. మేము సినిమాని జీవితాంతం ప్రేమించే వాళ్ళం. సినిమానే మాకు అంత ఇచ్చింది. సినిమాకి మేము తిరిగి ఇవ్వాలి. అలాంటి అవకాశం ఈ సినిమాతో వచ్చింది. సినిమాని సెలెబ్రేట్‌ చేసుకునేలాగా ఉంటుంది. మేము ఎప్పటినుంచో మంచి ఫ్రెండ్స్‌. కలిసి సినిమా చేయాలని అనుకున్నాం. అలాంటి మూమెంట్‌ ఈ సినిమాతో వచ్చింది. ఇందులో నా క్యారెక్టర్‌ కూడా చాలా క్రేజీగా వచ్చింది. ఆ క్యారెక్టర్‌ చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది’.

ఈ అనుభూతిని మళ్లీ రీ-క్రియేట్‌ చేయలేం : దుల్కర్‌సల్మాన్‌
”మహానటి’ సినిమాలో సినిమా ఉంటుంది. కానీ ఆ సినిమాకి ఒక రిఫరెన్స్‌ లేదు. ఈ క్యారెక్టర్‌ ఎలా చేస్తానని నేను డైరెక్టర్‌ మాట్లాడుకునేవాళ్లం. ఒక మ్యాజిక్‌ అయితే జరిగింది. అది మీరు ట్రైలర్‌లో చూశారు. రానా, సముద్రఖని, భాగ్యశ్రీ అందరూ కూడా అద్భుతమైన పెర్ఫార్మర్స్‌. వీళ్ళ అందరితో కలిసి వర్క్‌ పనిచేస్తున్నప్పుడు ఒక మ్యాజిక్‌ క్రియేట్‌ అయింది. ఈ సినిమా నా కెరీర్‌లో చాలా స్పెషల్‌ ఫిలిం. ఇలాంటి సినిమాలు జీవితంలో ఒకేసారి వస్తాయి. ఇలాంటి అనుభూతిని మళ్ళీ మళ్ళీ రీ- క్రియేట్‌ చేయలేం. నేను, రానా ఈ కథ విన్న వెంటనే కచ్చితంగా సినిమా చేయాలనుకున్నాం. డైరెక్టర్‌ సెల్వ కథని చాలా అద్భుతంగా చెబుతాడు. ఫస్ట్‌ టైం ఫిలిం మేకర్‌ ఉండాల్సిన ప్యాషన్‌ తనలో కనిపించింది. ఆ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయం మీద తనకి గ్రిప్‌ ఉంది. ప్రతిదీ రీసెర్చ్‌ చేసి పెట్టుకున్నాడు. ఈ సినిమాని రియల్‌గా సెలబ్రేట్‌ చేసుకునేలా ఉంటుంది. ఇందులో ఉండే డ్రామా ఎమోషన్‌ అద్భుతంగా ఉంటాయి’.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -