Saturday, July 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబాలీవుడ్ లో విషాదం.. కరిష్మా కపూర్ మాజీ భర్త మృతి

బాలీవుడ్ లో విషాదం.. కరిష్మా కపూర్ మాజీ భర్త మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకరైన సంజయ్ కపూర్ (53) కన్నుమూశారు. ఇంగ్లాండ్‌లో నిన్న‌ పోలో మ్యాచ్ ఆడుతుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. ఈ దురదృష్టకర సంఘటన గార్డ్స్ పోలో క్లబ్‌లో చోటుచేసుకుంది. ఆయన మరణవార్త వ్యాపార, సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పోలో ఆడుతున్న సమయంలో సంజయ్ కపూర్ అకస్మాత్తుగా ఒక తేనెటీగను మింగినట్లు తెలిసింది. దీనివల్ల తీవ్రమైన అలెర్జీ రియాక్షన్ వచ్చి, ఆయనకు ఊపిరాడలేదు. ఈ పరిస్థితి గుండెపోటుకు దారితీసిందని ప్రాథమికంగా నిర్ధారించారు. వెంటనే ఆటను నిలిపివేసి, వైద్య సహాయం అందించే ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం లేకపోయింది. ఆయనను బతికించలేకపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -