నవతెలంగాణ – నెల్లికుదురు
కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో మండల కేంద్రంలోని శివపార్వతి భక్త మార్కండేయ ఆలయంలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కూరపాటి వెంకటేశ్వర్లు కార్యదర్శి వేముల సుధాకర్ తెలిపారు. ఆ ఆలయ అర్చకుడు వెలుకూచి నాగయ్య శాస్త్రి ఆధ్వర్యంలో అభిషేకాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని హర హర మహాదేవ అంటూ భక్తి పరవశంలో మునిగి తేలారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి కోరికలు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కూరపాటి వెంకటేశ్వర్లు వేముల సుధాకర్ పాము రవీందర్ పాము వెంకటనారాయణ బేతు ఎల్లయ్య బేతు విజయకుమార్ వేముల సంపత్ వేముల శ్రీనివాస్ తో పాటు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కార్తీక మాసం పూజలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



