- Advertisement -
నవతెలంగాణ-భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు దేవాలయాలలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు జిల్లా కేంద్రంలోని పచ్చలకట్ట సోమేశ్వరాలయం, మురళీకృష్ణ దేవాలయం, హనుమాన్వాడలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం, స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు తెల్లవారుజామున మూడు గంటల నుండి క్యూ లైన్ లోకి నిలబడ్డారు. భువనగిరి మున్సిపల్ కమిషనర్ జి. రామలింగం, పచ్చల కట్ట సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పేద పండితులతో ఆశీర్వచనం పొందారు.
- Advertisement -


