Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయం19 ఏండ్ల తర్వాత 'కారుణ్యం'

19 ఏండ్ల తర్వాత ‘కారుణ్యం’

- Advertisement -

నిబంధనలు సడలించాలని సీఎం ఆదేశం
కానిస్టేబుల్‌ కుటుంబానికి ఉద్యోగం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

కారుణ్య నియామకం కోసం 19 ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఓ కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి సంతోషం కలిగించారు. దానికోసం అవసరమైతే నిబంధనలు సడలించాలని ఆదేశించడంతో ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి న్యాయం దక్కింది. వరంగల్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ బీ భీమ్‌సింగ్‌ సర్వీస్‌లో ఉండగా 1996 సెప్టెంబర్‌ 24న నక్సలైట్లతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. తండ్రి మరణం నేపథ్యంలో ఆయన కూతురు బీ రాజశ్రీ కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే వివిధ సాంకేతిక కారణాలు చూపిస్తూ గత ప్రభుత్వాలు ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించాయి. దీనిపై ఆమె అనేకసార్లు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సమస్యను వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మానవతా దృక్పథంతో స్పందించిన సీఎం నిబంధనలు సడలించైనా, ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులను ఆదేశించారు. దీనితో రాజశ్రీకి హౌం శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాజశ్రీ తన కుటుంబంతో కలిసి వచ్చి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు కూడా వారి వెంట ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad