Thursday, July 24, 2025
E-PAPER
Homeసినిమామాస్‌ ఎంటర్‌టైనర్‌గా 'కరుపు'

మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ‘కరుపు’

- Advertisement -

సూర్య నటిస్తున్న నయా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘కరుపు’. ఇది సూర్య నటిస్తున్న 45వ చిత్రం. ఆర్జే బాలాజీ దీనికి దర్శకుడు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
బుధవారం సూర్య పుట్టినరోజు కానుకగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్‌ చేసి ఆయన ఫ్యాన్స్‌కు మేకర్స్‌ డబుల్‌ ట్రీట్‌ ఇచ్చారు. ఈ టీజర్‌లో సూర్య పవర్‌ఫుల్‌ అవతార్‌లో అదిరిపోయే లుక్‌తో కనిపించారు. ఆ ఇంటెన్సిటీ, స్క్రీన్‌ ప్రెజెన్స్‌ అంచనాలుకు మించి ఉంది. 1 నిమిషం38 సెకన్ల టీజర్‌లో మాస్‌ మోమెంట్స్‌, ఫైర్‌ విజువల్స్‌, పవర్‌ ఫుల్‌ బీజీఎం అన్నీ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు ఆర్జే బాలాజీ మాస్‌ జోనర్‌లో చేసిన తొలి ప్రాజెక్ట్‌. సోషల్‌ కథలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు సూర్యతో కలిసి ఒక స్ట్రాంగ్‌, కమర్షియల్‌ సినిమాని తీసుకొచ్చారని టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. జీకే విష్ణు సినిమాటోగ్రఫీ చాలా గ్రాండ్‌గా ఉంది. ప్రతి సీన్‌లో గ్రాండ్‌ నెస్‌ కనిపిస్తోంది. సాయి అభ్యంకర్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ టీజర్‌కు జోష్‌ తీసుకొచ్చింది. ‘సూర్య నుంచి అటు ప్రేక్షకులు, ఇటు ఆయన అభిమానులు ఏమేమి కోరుకుంటున్నారో అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా సూర్య పోషించిన పాత్ర అందర్నీ సర్‌ప్రైజ్‌ చేస్తుంది. ఈ సినిమా ఒక మాస్‌ జాతరని తలపించేలా ఉంటుంది’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది.
సూర్య, త్రిష, ఇంద్రన్స్‌, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి, సుప్రీత్‌ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి రచన -దర్శకత్వం: ఆర్‌.జే.బాలాజీ, సినిమాటోగ్రఫీ – జికె విష్ణు, సంగీతం – సాయి అభ్యంకర్‌, యాక్షన్‌: అన్బరివ్‌ – విక్రమ్‌ మోర్‌, ఎడిటర్‌ – ఆర్‌.కళైవానన్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌ – అరుణ్‌ వెంజారామూడు, నిర్మాతలు: ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -