Wednesday, July 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసకల హంగులతో కస్తూర్బాగాంధీ ఇంటర్ కళాశాల నూతన భవనం

సకల హంగులతో కస్తూర్బాగాంధీ ఇంటర్ కళాశాల నూతన భవనం

- Advertisement -

– ప్రారంభించనున్న ఎంఎల్ ఏ జయవీర్
– రూ.1.54  కోట్లతో పూర్తైన నిర్మాణపనులు
– హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
నవతెలంగాణ-పెద్దవూర
: విద్యార్థినుల సౌకర్యార్థం అధునాతన వసతులతో నిర్మాణం పూర్తైన కస్తూర్బాగాంధీ జూనియర్ కళాశాల  నూతన భవనం ప్రారంభానికి సిద్ధమైనది.పెద్దవూర మండల కేంద్రంలో రూ.1.54  కోట్లతో నూతనంగా నిర్మించిన ఈ  భవనాన్ని గురువారం నాగార్జునసాగర్ ఎం ఎల్ ఏ కుందూరు జయవీర్ రెడ్డి ప్రారంభించనున్నారు. గతంలో నిర్మించిన భవనంలో ఇంటర్ వరకు ఒకే చోట బోధించే వారు. కొత్తగా ఇంటర్ కాలేజీ ఏర్పాటు కావడం తో సౌకర్యాలు సరిపడా ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యకం చేస్తున్నారు. ఇటీవల తాగునీటితోపాటు ఇతర వసతులు కల్పించారు. విద్యార్థినుల సౌకర్యార్థం నూతన భవనంలో విద్యుత్‌దీపాలు, ఫ్యాన్లు, తాగునీటి నల్లాలు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, విశాలమైన తరగతి గదులు, లైబ్రరీ, ల్యాబ్‌తోపాటు సకల వసతులను కల్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య భారం కాకూడదనే ఉద్దేశంతో రూ.154 కోట్లతో పెద్దవూర మండల కేంద్రం లో కస్తూర్బాగాంధీ ఇంటర్  నూతన భవనాన్ని నిర్మించారు.గతం లో నిర్మించిన కస్తూర్బాగాంధీ పాఠశాలలో ఇంటర్ వరకు ఒకే భవనం ఉండేది.కానీ ఇప్పుడు కొత్త ఇంటర్ కాలేజీకి నూతన భవనం నిర్మాణం పూర్తియింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కోట్లాది రూపాయలను ఖర్చు చేసి అన్ని హంగులతో నూతన భవనాన్ని నిర్మాణం చేశారు.కస్తూర్బాగాంధీ నూతన భవనంలో అన్ని వసతులు ఉండటంతో విద్యార్థినులు,తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -