నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం సింగరేణి ఇల్లందు క్లబ్ లో నిర్వహించి జిల్లా స్థాయి యువజన క్రీడా ఉత్సవాలలో కాటారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు విజ్ఞ బృందం ఎంపికయ్యారు. మార్బుల ప్రాంతమైన కాటారం నుంచి వెలికి తీసినటువంటి మట్టిలో మాణిక్యాలు ఈ బాలికలు స్థానిక శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ కోట రాజబాబు, యువజన విభాగం నిర్వాహకులు రఘు, సైన్స్ విభాగం బర్ల స్వామి, కాటారం మాజీ ఎంపీపీ శ్రీ పంతకాని సమ్మయ్య, బాలికలను అభినందించి మెమొంటోలతో సత్కరించారు. ఈ క్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ సోమలింగం, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు గైడ్ టీచరుగా వ్యవహరించినటువంటి ఉపాధ్యాయులు బానోతు రాజు నాయక్, భూక్య కవితా బాలికలను అభినందించినారు.
రాష్ట్రస్థాయి యువజన ఉత్సవాలకు కాటారం విద్యార్థినీలు ఎంపిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



