Sunday, November 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధికి ఆమడ దూరంలో కాటారం సబ్ డివిజన్..

అభివృద్ధికి ఆమడ దూరంలో కాటారం సబ్ డివిజన్..

- Advertisement -

ఆత్కూరి శ్రీకాంత్: వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి 
నవతెలంగాణ – కాటారం

ఏళ్లు గడుస్తున్నా కాటారం సబ్ డివిజన్ పరిధిలో గల మండలాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్ అన్నారు. అయినా పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..60 ఏండ్లుగా కాటారం సబ్ డివిజన్ రోజురోజుకి వెనుకబాటుకు గురవుతోందని అన్నారు.

ప్రజల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ పురోగతిని సాధించాలంటే కాటారం సబ్ డివిజన్ కు రూ.500 కోట్ల నిధులు కేటాయించాలని అన్నారు. వంద పడకల ఆస్పత్రి, మినీ స్టేడియం, డిజిటల్ లైబ్రరీస్, అంబేద్కర్ విజ్ఞాన కేంద్రము, పరిశ్రమలు, నేషనల్ హైవే మొదలుకొని గ్రామీణ స్థాయి వరకు రోడ్ల పునరుద్ధరణ, ఎస్ఎంఎస్ హాస్టల్ ఏర్పాటు చేసి కాటారం సబ్ డివిజన్ అభివృద్ధి చేయాలని పాలకులకు విజ్ఞప్తి చేశారు. రోడ్ల పునరుద్ధరణ కార్యక్రమాన్ని తీసుకొని సామాన్యుల ప్రాణాలను కాపాడే విధంగా చర్యలు తీసుకోకపోతే అధికారుల మీద, పాలకుల మీద పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. త్వరలోనే ప్రతిపక్ష పార్టీలను, ప్రజాసంఘాల నాయకులను కలిసి భవిష్యత్తు కార్యచరణని ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బిఆర్ఎస్ ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు పంతగాని సడవలి, నాయకులు కోర్స్ రాజశేఖర్, గుమ్మడి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -