- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజిత మరణం పట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. టి రజిత తెలంగాణ మలి దశ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ ప్రోత్సాహంతో అనేక బహిరంగ సభల్లో తన ఉపన్యాసాలతో ప్రజలను ఉద్యమం వైపు ఆకర్షితులయ్యేలా చేశారని కవిత గుర్తుచేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
- Advertisement -