నవతెలంగాణ-హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి బీఆర్ఎస్‌పై జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో మాత్రమే బీఆర్ఎస్ ఉందని.. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోయిందని విమర్శలు చేశారు. ఇవాళ(శనివారం) మెదక్ జిల్లాలో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు జగదీశ్‌రెడ్డి, మదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డిలు గతంలో ఎలా ఉండేవారని.. ఇప్పుడు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నల వర్షం కురిపించారు. తామే ప్రధాన ప్రతిపక్షంగా పనిచేస్తామని ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ నేతలు ఆస్తులు పెంచుకున్నారని… కానీ కేడర్‌ను మాత్రం పెంచుకోలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ఫూర్తితోనే తాము ప్రజల కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు కవిత.
మరోసారి బీఆర్ఎస్‌పై కవిత హాట్ కామెంట్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



