Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో కుటుంబ సభ్యులతో కవిత ప్రత్యేక పూజలు  

శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో కుటుంబ సభ్యులతో కవిత ప్రత్యేక పూజలు  

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్ 
కార్తీక పౌర్ణమి మరుసటి రోజు గురువారం ఉదయం నిజామాబాద్ లోని శ్రీ నీలకంఠేశ్వర్వర స్వామి వారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులతో కలిసి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ..ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి, కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేశారు.కార్తీక పౌర్ణమి మరుసటి రోజున ఎప్పటిమాదిరిగానే శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి అభిషేకం చేశామన్నారు.ఆ స్వామివారి దయతో జిల్లా ప్రజలు బాగుండాలని కోరుకున్నాను అని తెలియజేశారు.మొంథా తుపాను వల్ల రకరకాల నష్టాలు జరిగినయి, ప్రజలంతా మనోధైర్యంతో ఉండాలని కోరుకున్నను.డెఫినెట్ గా మంచి రోజులు వస్తాయి. మనోధైర్యంతో ఉండాలని కోరుతున్నాం అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -