Thursday, January 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకవిత రాజీనామా ఆమోదం

కవిత రాజీనామా ఆమోదం

- Advertisement -

ఈసీకి నోటిఫికేషన్‌ పంపిన కార్యదర్శి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత చేసిన రాజీనామాను శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆమోదించారు. కవిత నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గంనుంచి ఎమ్మెల్సీగా శాసనమండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమెను బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌చేసిన తర్వాత ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్‌లో ఆమె తన రాజీనామా పత్రం మండలి చైర్మెన్‌కు ఇచ్చారు. చివరిసారిగా ఆమె మండలిలో సోమవారం భావోద్వేగంగా మాట్లాడిన విషయం తెలిసిందే.ఈ మేరకు ఈసీకి నోటిఫికేషన్‌ అసెంబ్లీ కార్యదర్శి పంపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -