– స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను దక్షిణ మధ్య రైల్వే జనరల మేనేజర్ (జీఎం) సంజరు కుమార్ శ్రీవాస్తవ ఎగరవేశారు. ఆర్పీఎఫ్ బృందంతో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జోన్ పనితీరు, అత్యుత్తమ విజయాలను వివరించారు. ఏప్రిల్ నుంచి జులై వరకు రూ.6,960 కోట్ల స్థూల ఆదాయన్ని నమోదు చేశామని చెప్పారు. గతేడాది ఇదే కాలంలో రూ.6,894 కోట్లను సాధించామని అన్నారు. రవాణా లోడింగ్‌లో మునుపెన్నడూ లేని విధంగా 49 మిలియన్ టన్నుల రికార్డు స్థాయిని నమోదు చేసిందన్నారు. సరుకు రవాణా ఆదాయం రూ.4,601 కోట్లు కాగా, 96 మిలియన్ల ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చి ప్రయాణీకుల విభాగంలో రూ.1,990 కోట్ల ఆదాయం నమోదు చేశామని వివరించారు. డబ్లింగ్, ట్రిప్లింగ్ ప్రాజెక్టులైన కాజీపేట-విజయవాడ-గూడూరు-బల్హర్షా, విజయవాడ- గూడూరు ట్రిప్లింగ్ ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తి చేస్తామన్నారు. కాజీపేట రైలు తయారీ యూనిట్ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తవుతుందన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశముందని అన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాశ్, ఇన్‌స్పెక్టర్ కమ్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ అరోమాసింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.
కాజీపేట రైలు తయారీ యూనిట్ వేగంగా అభివృధ్ధి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES