నవతెలంగాణ-హైదరాబాద్ : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ మంగళవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా, రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కాళేశ్వరంపై సీబీఐకి విచారణ కొరుతూ కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో కేసీఆర్, హరీశ్ రావు మరోసారి హైకోర్టును ఆశ్రయించబోతున్నట్లుగా సమాచారం. కాళేశ్వరంపై పలు నివేదికల ఆధారంగా ఎలాంటి విచారణ చేపట్టొదంటూ ఆదేశాలు ఇవ్వాలని వారు హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు జస్టిస్ చంద్రఘోష్ ఇచ్చిన కాళేశ్వరం కమిషన్ నివేదికను రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ.. మాజీ ఇరిగేషన్ సెక్రటరీ ఎస్‌కే జోషి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఆ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
మరోసారి హైకోర్టుకు కేసీఆర్, హరీష్ రావు..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES