Tuesday, December 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమేడ్చల్‌కు కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డి చేసిందేమీ లేదు

మేడ్చల్‌కు కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డి చేసిందేమీ లేదు

- Advertisement -

ఆ జిల్లా ఎమ్మెల్యేలంతా బంగారు తెలంగాణ టీం.. : తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ-కూకట్‌పల్లి

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో ఎక్కడ చూసినా సమస్యలే తాండవిస్తున్నాయని, ఈ జిల్లాకు మాజీ సీఎం కేసీఆర్‌, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిందేమీ లేదని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఆమె విస్తతంగా పర్యటించారు. మొదట వైజంక్షన్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. బాలానగర్‌లోని పీహెచ్‌సీ ఆస్పత్రిని సందర్శించి.. వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. కేపీహెచ్‌బీలోని రమ్య గ్రౌండ్స్‌ వద్ద ఉన్న పాఠశాల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వైజంక్షన్‌లోని ఓ హౌటల్‌లో మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. కూకట్‌పల్లి హైదరాబాద్‌కు కామధేనువుగా మారిందని, కానీ ఇక్కడ అభివృద్ధి ఏమీ చేయలేదన్నారు. కూకట్‌పల్లిలో రూ.2 వేల కోట్ల విలువైన భూములను ప్రభుత్వం అమ్మేసిందని, నియోజకవర్గ అభివృద్ధి కోసం రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. మేడ్చల్‌ జిల్లాలో పేదల సమస్యలు పరిష్కారం కావడం లేదని, పాలకపక్షం పట్టించుకోవటం లేదు.. ప్రతిపక్షం అడగటం లేదన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ బంగారు తెలంగాణ టీం అని, వీరందరూ కలిసి.. ఉద్యమం చేసి పార్టీలో కొనసాగుతున్న వారిని అణగదొక్కి పైకి వచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహాలను తొలగించి వాటిని తిరిగి గాంధీ భవన్‌కే పంపిస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -