Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాళేశ్వరం పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేసిన కేసీఆర్

కాళేశ్వరం పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేసిన కేసీఆర్

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి..
నవతెలంగాణ – తిమ్మాజిపేట

గోదావరి నది పై అడ్డగోలు గా ప్రాజెక్టులు కట్టి తెలంగాణా కు నీళ్లు రాని పరిస్థితుల్లో కెసీఆర్ ముందు చూపుతో కాళేశ్వరం పూర్తి తెస్తే తెలంగాణా సస్యాశ్యామలం చేశారన్నారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు బిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్ లో మంగళవారం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం పై వీడియో ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్, హర్షవర్ధన్ రెడ్డిలు వీక్షించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడారు.

కెసిఆర్ ముందు చూపుతో కాళేశ్వరం పూర్తి చేసిన తెలంగాణా సస్యాశ్యామలం అయితే కాళేశ్వరం పై తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు ఊరుకోరన్నారు. రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనా  గాలి మోటార్లు ఎక్కి గాలి ముచ్చట్లు చెప్పడానికే సరిపోయింది. సోషల్ మీడియా వేదిక గా చేసుకొని అబద్దపు మాటలతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం పాలన పక్కకు పెట్టి రాజకీయ కక్ష్య సాధింపులే లక్ష్యంగా నడుతుంది. పోలవరం 3 సార్లు కూలితే ఒక్కసారి కూడా ఎన్ డి ఎస్ ఏ రిపోర్ట్ లేదు కానీ ఇంత పెద్ద కాళేశ్వరంలో  ఒక్క మేడి గడ్డ బ్యారేజి లో 2 పిల్లర్లు కుంగితే రిపేర్ చేసే వెసులుబాటు ఉన్న దాన్ని వారి రాజకీయ లబ్ది కోసం స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాద్దాంతం చేస్తున్నారు.

రేవంత్ పాలన అంత ఒక టీవీ సీరియల్ లా నడుస్తోంది మొన్నటి వరకు ఫార్ములా 1 కేసు అన్నారు. నిన్న ఫోన్ ట్యాపింగ్ అన్నారు. అందులో ఏం చేయలేకపోయే సరికి నేడు కాళేశ్వరం మీద పడ్డరు. తమ్మిడి హెట్టి నుండి మేడి గడ్డకు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ఈ పోగ్రామ్ ముఖ్య ఉద్దేశ్యం కాళేశ్వరం పై ఈ కాంగ్రెస్ పన్నుతున్న  కుట్రలను, వాస్తావాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళటమే మన కర్తవ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -