Tuesday, November 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉమ్రా యాత్రికుల మరణాల పట్ల కేసీఆర్‌ సంతాపం

ఉమ్రా యాత్రికుల మరణాల పట్ల కేసీఆర్‌ సంతాపం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణ వాసులు మరణించడం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి సోమవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. బస్సు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సంబంధిత చర్యలు చేపట్టాలని కోరారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలనీ, గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

బస్సు ప్రమాదం బాధాకరం : కేటీఆర్‌
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన అనేక మంది యాత్రికులు మరణించడం అత్యంత బాధాకరమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీమంత్రి కే తారక రామారావు (కేటీఆర్‌) తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపాన్ని ప్రకటించారు. మృతుల్లో ఎక్కువమంది హైదరాబాదీలే ఉన్నారనే సమాచారం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విదేశీ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలను ముమ్మరం చేయాలని కోరారు. మరణించిన వారి వివరాలను గుర్తించి వారి కుటుంబాలకు అన్నిరకాలుగా ప్రభుత్వం అండగా నిలవాలని సూచించారు. సౌదీ అరెబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన అనేక మంది మరణించడం పట్ల బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సంతాపం తెలిపారు.

సౌదీకి బీఆర్‌ఎస్‌ మైనార్టీ బృందం
సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన మైనార్టీ సోదరుల కుటుంబాలకు అండగా ఉండేందుకు బీఆర్‌ఎస్‌ మైనార్టీ నేతల బృందం కేటీఆర్‌ ఆదేశాల మేరకు సౌదీ బయలుదేరి వెళ్లనుంది. ఈ మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీతోపాటు పలువురు సీనియర్‌ నేతలతో ఫోన్లో మాట్లాడి సౌదీ వెళ్లాల్సిందిగా ఆయన సూచించారు. కేటీఆర్‌ ఆదేశాల మేరకు మైనార్టీ నేతలు బృందం సౌదీకి సోమవారం బయలుదేరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -