- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజి వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనలో 20 మంది మృతి చెందిన ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంతమంది ప్రయాణికులు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడటం చాలా బాధాకరం అని తెలిపారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్, కేటీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
- Advertisement -



