- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సౌదీ అరేబియాలో బస్సు అగ్ని ప్రమాదానికి గురై 42 మంది మరణించడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో బదర్-మదీనా మధ్య డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొన్న బస్సులో ప్రయాణిస్తున్న 42 మంది నిద్రలోనే సజీవ దహనమయ్యారు. మృతుల్లో హైదరాబాదీలు కూడా ఉన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కేసీఆర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
- Advertisement -


