Sunday, July 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరెండో రోజూ ఏఐజీ ఆస్పత్రికి కేసీఆర్‌

రెండో రోజూ ఏఐజీ ఆస్పత్రికి కేసీఆర్‌

- Advertisement -

నవతెలంగాణ-శేరిలింగంపల్లి
బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం కూడా రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ సాధారణ వైద్య పరీక్షలు చేయించుకుని వెళ్లారు. శుక్రవారం ఆస్పత్రికి వెళ్లిన ఆయనకు కొన్ని పరీక్షలు చేసిన వైద్యులు, రెండో రోజు శనివారం మరికొన్ని పరీక్షలు చేసినట్టు ఆస్పత్రి సిబ్బంది తెలిపింది. ఈ సందర్భంగా ఆరోగ్యంపై కేసీఆర్‌కు పలు సలహాలు, సూచనలు చేశారు. కేసీఆర్‌ తరచుగా తమ ఆస్పత్రికి వస్తారని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -