- Advertisement -
నవతెలంగాణ – బజార్ హాత్నూర్
వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ మొదలగు జ్వరాలు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ భీమ్రావు అన్నారు. సోమవారం మండలంలోని ఉప్పర్ పల్లి గ్రామంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ భీమ్రావు మాట్లాడుతూ.. కీటక జనిత వ్యాధులపై గ్రామస్తులకు అవగాహన కలిగించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దోమల నియంత్రణ, మలేరియా, డెంగ్యూ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ఎస్ సుశీల, సూపర్వైజర్ ఉల్ధరాణి, హెల్త్ అసిస్టెంట్ రమేష్, ఏఎన్ఎం మంజుల తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -