- Advertisement -
తంగళ్ళపల్లిలో డ్రైడే 
నవతెలంగాణ – తంగళ్ళపల్లి 
చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీ ఓ మీర్జా ప్రజలకు సూచించారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఓ, ఏఎన్ఎం తో పాటు గ్రామస్థాయి అధికారులు గ్రామంలో ఇంటింటా తిరుగుతూ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీవో మాట్లాడుతూ..ప్రజలు తమ ఇళ్ల పరిసరాలలో, ట్యాంకులలో, ఇతర పాత్రలలో నిల్వ ఉన్న నీటిని తొలగించి, దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం జ్యోతి పాల్గొన్నారు.
- Advertisement -

 
                                    