నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో దేశ, అంతర్జాతీయ అతిధులకోసం ప్రత్యేకంగా ‘గాలా డిన్నర్’ నిర్వహించారు. రకరకాల వంటకాలతో అతిధులకు కొసరి కొసరి వడ్డించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఎమ్‌ఎమ్ కీరవాణి బృందం పాటలతో మ్యూజికల్ నైట్ నిర్వహించారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ సినీ నటులు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయికుమార్ గాత్రంతో కాకతీయ సామ్రాజ్యం, రాణి రుద్రమదేవి వీరోచిత పాత్రతో ప్రదర్శించిన నృత్య రూపకం ఆకట్టుకుంది. తెలంగాణ వైభవం చాటి చెప్పే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తదితరులు ఆసక్తిగా కార్యక్రమాలను వీక్షించారు. అనంతరం కళాకారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు.
గ్లోబల్‌లో కీరవాణి గానాబజానా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



