- Advertisement -
నవతెలంగాణ – ఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు అధికారిక బంగ్లా లభించింది. సీఎం అధికారిక నివాసాన్ని విడిచిపెట్టిన దాదాపు ఏడాది తర్వాత ఆయనకు కేంద్రం అధికారిక బంగ్లాను కేటాయించింది. 95, లోధి ఎస్టేట్‌లోని టైప్ 7 బంగ్లాను కేటాయించింది. అయితే, బీఎస్పీ అధినేత్రి మాయావతి గతంలో నివసించిన లోధి ఎస్టేట్‌లోని బంగ్లాను కేజ్రీవాల్‌కు కేటాయించాలని ఆప్ కోరింది. కానీ ఆ బంగ్లాను జూన్‌లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరికి కేటాయించడంతో.. కేజ్రీకి వేరే బంగ్లా అలాట్ చేశారు.
- Advertisement -