దేశంలో ఉత్తమ అగ్రశ్రేణి గృహనిర్మాణ పథకమంటూ నీతి ఆయోగ్ ప్రశంస
ఫిబ్రవరి నాటికి ఐదు లక్షల ఇండ్ల నిర్మాణమే లక్ష్యం : మంత్రి ఎంబి రాజేశ్
తిరువనంతపురం: కేరళలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహనిర్మాణ పథకమైన లైఫ్ మిషన్ ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. దేశంలోని ఉత్తమ గృహనిర్మాణ పథకాలలో ఒకటిగా నీతి ఆయోగ్ లైఫ్ మిషన్‌ను ఎంపిక చేసింది. అంతేకాక తక్కువ వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టులలో ఈ మిషన్‌ను ఒక ఉత్తమ విధానంగా గుర్తించింది. ఈ సందర్భంగా మంత్రి ఎంబి రాజేశ్ మాట్లాడుతూ ఫిబ్రవరి నాటికి ఐదు లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తి చేసే దిశగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతోందని తెలిపారు. వాయనాడ్‌లో ఇండ్ల కేటాయింపుపై ప్రతిపక్ష నాయకుడు చేస్తున్న వాదనలకు భిన్నంగా, లైఫ్ మిషన్ వాస్తవిక నిబద్ధతలపై ఆధారపడి ఉందని అన్నారు. మేం చేయగలిగినదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం అని మంత్రి స్పష్టం చేశారు.
నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం.. ”ఈ పథకం బహుళ-భాగస్వాముల, సమాజ ఆధారిత నమూనాను అనుసరిస్తుంది. ఇదే దాని విజయానికి దోహద పడింది. ఇప్పటివరకు ఈ లైఫ్ మిషన్ పథకం కింద 6.5 లక్షల ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్టులు మంజూరయ్యాయి. వీటిలో 4.07 లక్షల ఇండ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం 1.02 లక్షల ఇండ్ల నిర్మాణం జరుగుతోంది” అని మంత్రి తెలిపారు. గతంలో ఈ మిషన్‌ను మూసివే స్తామని ప్రకటించిన యూడీఎఫ్‌పై మండిపడ్డారు. అయితే ఈ లైఫ్ మిషన్ భారతదేశంలో అత్యధిక ఆర్థిక సహాయం అందించే గృహనిర్మాణ పథకం. ఈ పథకం ద్వారా అర్హులైన లబ్దిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు లభిస్తాయి. ఇక షెడ్యూల్డ్ తెగల ప్రాంతాల్లో ఉన్నవారికి రూ. 6 లక్షలు అందుతాయి.
కేరళ లైఫ్‌మిషన్ భేష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



