నవతెలంగాణ-హైదరాబాద్: ఛత్తీస్‌గడ్ లో అరెస్టయిన కేరళకు చెందిన ఇద్దరు నన్స్‌కు బెయిల్ వచ్చింది. ఈ మేరకు బిలాసపూర్ లోకల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని వారి తరుపు న్యాయవాది గోపా కుమార్ చెప్పారు.. గత నెల 29న దుర్గ పూర్ పీఎస్ పరిధిలో బలవంతపు మత మార్పిడిలతో పాటు మనవ ఆక్రమ రవాణకు పాల్పడుతున్నారనే అభియోగం ఆ రాష్ట్ర పోలీసులు నన్స్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తాజాగా ఇరువర్గాల వాదోపవాదలు విన్న తర్వాత షరుతులతో కూడిన బెయిల్‌ను కోర్టు జారీ చేసింది.
కాగా కేరళకు చెందిన ఆ ఇద్దరు సన్యాసినిలు ముగ్గురు గిరిజన బాలికలను మతమార్పిడి చేయించేందుకు ప్రయత్నించారని బజరంగ్ దల్, హిందూవాహిని సంఘాల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో గత నెల 25న పోలీసులు ఆ ఇద్దరు సన్యాసినులను అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం సన్యాసినిలు ముందు దుర్గ్‌లోని సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.