- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : యూఏఈలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రాస్ ఆల్ ఖైమా ప్రాంతంలో ప్రవాస భారతీయుడు గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటు చేసుకుంది. కేరళలోని మలప్పురం ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువకుడు సల్మాన్ ఫరీజ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. నిర్మాణంలో ఉన్న ఓ భవనం గోడ ప్రమాదవశాత్తూ కూలడంతో సల్మాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు రాస్ అల్ ఖైమా పోలీసులు ధ్రువీకరణ కోసం స్థానిక మీడియా ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.
- Advertisement -



