Saturday, October 25, 2025
E-PAPER
Homeజాతీయంవైద్యురాలి ఆత్మహత్య కేసులో కీల‌క ప‌రిణామం

వైద్యురాలి ఆత్మహత్య కేసులో కీల‌క ప‌రిణామం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మహారాష్ట్రలోని సతారాలో వైద్యురాలి ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన ప్రశాంత్ బంకర్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. డాక్టర్ అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కుమారుడే ఈ ప్రశాంత్ బంకర్. అరెస్ట్ అనంతరం అతడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ (పీఎస్ఐ) గోపాల్ బడానే పరారీలో ఉన్నాడు.

పోలీసుల దర్యాప్తు ప్రకారం పీఎస్ఐ గోపాల్‌తో కుమ్మక్కై ప్రశాంత్ బంకర్ డాక్టర్‌ను మానసికంగా వేధించాడు. అద్దె గదిని ఖాళీ చేయాలంటూ పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. డాక్టర్ ఆరోపణలు చేసిన పోలీసు అధికారులతో ప్రశాంత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై పోలీసులు అత్యాచారం, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -