Thursday, March 26, 2026
E-PAPER
HomeNewsYashoda Hospital:రోగి ఎముకను కత్తిరించకుండా కీ హోల్ సర్జరీ: డాక్టర్ విశాల్ ఖాంటే

Yashoda Hospital:రోగి ఎముకను కత్తిరించకుండా కీ హోల్ సర్జరీ: డాక్టర్ విశాల్ ఖాంటే

- Advertisement -




విజయవంతమైన సర్జరీ

నవతెలంగాణ కంఠేశ్వర్

రోగి ఎముకను కత్తిరించకుండా విజయవంతంగా కీ హోల్ సర్జరీ చేయడం జరిగిందని యశోద హాస్పిటల్ డాక్టర్ విశాల్ ఖాంటే తెలిపారు. గురువారం నగరంలోని యశోద మెడికల్ సెంటర్ నిజామాబాద్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్ డాక్టర్ విశాల్ ఖాంటే మాట్లాడుతూ.. నిజామాబాద్ కు చెందిన అనీస్ ఫాతిమా 80 సంవత్సరాల వయస్సు సుమారు రెండు మూడు సంవత్సరాల నుండి శ్రమ, శ్వాస ఆడక పోవడం వంటి సమస్యలతో ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు తీవ్రమైన అయోర్టిక్ స్టెనోసిస్ (బృహద్ధమని కవాటంలో అడ్డుపడటం) ఉన్నట్లు నిర్ధారణ అయింది అని వివరించారు. ఆమె శస్త్రచికిత్స చేయించుకోవడానికి భయపడుతూ సమస్య ఉందని తెలిపింది. ఆమె సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్స్‌లో ఆమెకు మినిమల్లీ ఇన్వాసివ్ కార్డియాక్ సర్జరీ (ఏం ఐ సి ఎస్/కీ హోల్ హార్ట్ సర్జరీ) చేయమని డాక్టర్ విశాల్ ఖాంటే, డాక్టర్ ఎమ్‌డి వహాజ్ అలీ సలహా ఇచ్చామన్నారు. రోగి ఎముకను కత్తిరించకుండా కీ హోల్ హార్ట్ సర్జరీ (ఎం ఐ సి ఎస్-ఏ వి ఆర్ ) చేయించుకున్నారు. రికవరీ వేగంగా ఉండే కొత్త టెక్నాలజీని ఉపయోగించి శస్త్రచికిత్స చేసామన్నారు. తర్వాత 4 రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు.

ప్రస్తుతం, శస్త్రచికిత్స జరిగిన 1 నెల తర్వాత, ఆమెకు ఆపరేషన్ జరిగిన స్థానంలో ఎలాంటి సమస్యలు లేవని, కొంచెం నొప్పి మినహా ఎటువంటి లక్షణాలు లేవు అని తెలిపింది. ఆమె రోజువారీ కార్యకలాపాలను ప్రస్తుతం చేసుకుంటుందని మీడియా సమావేశంలో ఆమె వివరించంది. ఈ కార్యక్రమంలో అనీస్ ఫాతిమా కుటుంబ సభ్యులు, యశోద హాస్పిటల్ మేనేజర్ శ్రీరామ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -