- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కీలక నేత, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్ మంగళవారం డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఆయన మావోయిస్టు పార్టీలో 45 ఏళ్లు వివిధ స్థాయిల్లో పనిచేశారు. ప్రభాత్ అనే పేరుతో ప్రెస్‌టీమ్ ఇన్‌ఛార్జిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. గత 20 ఏళ్లుగా బండి ప్రకాశ్ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు.
- Advertisement -



