నవతెలంగాణ-హైదరాబాద్: మావోయిస్టు పార్టీ సైనిక విభాగం అయిన పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (PGLA) చీఫ్ బర్సె దేవా, మరో 48 మంది అనుచరులతో కలిసి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా సరెండర్ అయ్యారు. త్వరలోనే వీరికి అందే పునరావాస ప్యాకేజీల వివరాలను వెల్లడించనున్నారు.
బర్సె దేవా మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన వ్యూహకర్తగా పేరుపొందారు. ముఖ్యంగా అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత, పార్టీ సాయుధ బలగాల బాధ్యతలను భుజాన వేసుకున్న దేవా, గెరిల్లా యుద్ధ తంత్రాలను అమలు చేయడంలోనూ , పార్టీకి అత్యాధునిక ఆయుధాలను సరఫరా చేయడంలోనూ ప్రధాన పాత్ర పోషించారు. ఆశ్చర్యకరంగా హిడ్మా , బర్సె దేవా ఇద్దరూ ఛత్తీస్‌గఢ్‌లోని ఒకే గ్రామానికి చెందిన వారు కావడం గమనార్హం. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు నిర్వహించిన పక్కా ఆపరేషన్ ఫలితంగానే ఈ లొంగుబాటు సాధ్యమైంది.



