నవతెలంగాణ – పెద్దవంగర
జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ఐ క్రీడా పోటీలకు మండలంలోని కేజీబీవీ విద్యార్థులు ఎంపికైనట్లు ప్రత్యేకాధికారి గంగారపు స్రవంతి తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. చెర్లపాలెం ఉన్నత పాఠశాలలో ఇటీవల జరిగిన జోనల్ స్థాయి ఎస్జీఎఫ్ఐ క్రీడా పోటీల్లో పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు ఎస్ఓ తెలిపారు. అండర్ 17 కబడ్డీ బాలికల విభాగంలో త్రివేణి, శ్రావణి, ఖోఖో బాలికల విభాగంలో హారిక, వాలీబాల్ బాలికల విభాగంలో చైతన్య, అండర్ 14 కబడ్డీ బాలికల విభాగంలో పల్లవి, జీవిత, సాత్విక, వైష్ణవి, ఖోఖో బాలికల విభాగంలో చైతన్య, శృతి, వాలీబాల్ బాలికల విభాగంలో సంకీర్తన, హర్షిత లు ఎంపికయ్యారు. వీరు త్వరలో జరగనున్న జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. జోనల్ స్థాయిలో అద్భత ప్రతిభ కనబరిచిన విద్యార్థినిలు, పీఈటీ లను ఎస్ఓ, ఉపాధ్యాయుల బృందం అభినందించారు.
జిల్లా స్థాయి క్రీడా పోటీలకు కేజీబీవీ విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



