సావర్గావ్ మాజీ సర్పంచ్ పవర్ కిషన్
నవతెలంగాణ – జుక్కల్
కామారెడ్డి జిల్లా బంజారాల రిజర్వేషన్ ల జోలికి ఎవరైనా వస్తే ఖబర్దార్ అని కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సావర్గావ్ మాజీ సర్పంచ్ పవర్ కిషన్ హెచ్చరించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కొంతమంది ఆదివాసి నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం సరికాదని అన్నారు. కుహాన రాజకీయ నాయకులు స్వలాభం కోసం గిరిజనుల మధ్య తగాదాలు పెట్టొద్దని సూచించారు. బంజారా నాయకుల మీద చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలన్నారు. బంజారాలో ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఖబర్దార్.. బంజారాల ఐక్యతను నిర్వీర్యం చేయడానికి ఎవరైనా కుట్రలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని ఘాటుగా హెచ్చరించారు.
లంబాడా రిజర్వేషన్ల జోలికి వస్తే ఖబర్దార్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES