Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఖమ్మం వందేళ్ళ ముగింపు ఉత్సవం చారిత్రాత్మక ఘట్టం: రమేష్

ఖమ్మం వందేళ్ళ ముగింపు ఉత్సవం చారిత్రాత్మక ఘట్టం: రమేష్

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి 
ఖమ్మంలో డిసెంబర్ 26న జరగనున్న సిపిఐ వందేళ్ళ ముగింపు ఉత్సవం ఒక చారిత్రాత్మక ఘట్టమని, పార్టీ శ్రేణులు కష్టజీవులు భాగస్వాములు కావాలని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ కోరారు. శుక్రవారం వనపర్తి సిపిఐ ఆఫీసులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిపిఐ కి మాత్రమే పొందేళ్ల పోరాట చరిత్ర ఉందన్నారు. కష్టజీవుల పక్షాన అనేక పోరాటాలు చేసి ఎన్నో చట్టాలను సాధించిందన్నారు. దేశంలో సిపిఐ పాత్రలేని పోరాటం లేదన్నారు. పేదలకు ఎర్రజెండా మాత్రమే అండగా ఉంటుందన్నారు. కమ్యూనిస్టు పార్టీ లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. సంపన్ను దోపిడీ నుంచి అన్ని వర్గాలను సిపిఐ కాపాడుతూ వస్తోందన్నారు.

బూర్జవ పార్టీలు అధికారమే లక్ష్యంగా పనిచేస్తాయని సిపిఐ ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా అధికారం ఉన్నా లేకున్నా ప్రజలను సమీకరించి పోరాడుతుందన్నారు. అలాంటి పార్టీ వందేళ్ళ ముగింపు ఉత్సవాలు ఖమ్మంలో అంగరంగ వైభవంగా జరగబోతున్న అన్నారు. డిసెంబర్ 26న ముగింపు సభ నేపథ్యంలో రాష్ట్రంలో మూడు ప్రచార జాతాలు బయలుదేరాయన్నారు. సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ నాయకత్వంలో రేపు గద్వాల నుంచి బయలుదేరిన జాత రేపు మధ్యాహ్నం పెబ్బేరుల ప్రవేశించి మధ్యాహ్నం రెండు గంటలకు వనపర్తి వస్తుందన్నారు. పార్టీ శ్రేణులు అభిమానులు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికి విజయవంతం చేయాలన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, నేతలు పృథ్వి నాదం, జయమ్మ శిరీష వంశీ అంజి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -