Saturday, October 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వారం రోజుల్లో ఖాన్ చెరువు కెనాల్ పనులు పూర్తవ్వాలి

వారం రోజుల్లో ఖాన్ చెరువు కెనాల్ పనులు పూర్తవ్వాలి

- Advertisement -

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి
ఆరేళ్లుగా అస్తవ్యస్తంగా కాలువ పనులు ..
పట్టించుకోలేదని అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
నవతెలంగాణ – వనపర్తి
 గత ఆరున్నర సంవత్సరాలుగా కొనసాగుతున్న ఖాన్ చెరువు కెనాల్ నిర్మాణం పనులు వారం రోజుల్లోపు పూర్తిచేయాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అధికారులను ఆదేశించారు. కాలువ నిర్మాణం పనులు నేటికీ నత్త నడకన సాగడంపై ఎమ్మెల్యే మేఘారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గ్రామస్తుల కోరిక మేరకు కాలువ నిర్మాణ పనులను ఎమ్మెల్యే సందర్శించి పరిశీలించారు. దత్తాయపల్లి సమీపంలో 150 మీటర్ల కాలువ తవ్వెందుకు అటవీశాఖ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడం పై ఆయన తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో కెనాల్ పనులు పూర్తవ్వాలని లేదంటే తానే స్వయంగా పనులు చేయించాల్సి వస్తుందని ఎమ్మెల్యే అధికారులను హెచ్చరించారు.

చందాపూర్ రోడ్డు నిర్మాణం పనుల సైతం అలాగే ఉన్నాయని, రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కెనాల్ సమస్యను పరిష్కరించే ముందుకు వచ్చి సహకరించిన గ్రామ రైతులను ఆయన శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా లింకు కెనాల్ కు సంబంధించిన పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు కిచ్చారెడ్డి, శంకర్ నాయక్, అటవీ శాఖ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -