Wednesday, July 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం4న రాష్ట్రానికి ఖర్గే రాక

4న రాష్ట్రానికి ఖర్గే రాక

- Advertisement -

– ఎల్బీస్టేడియంలో కాంగ్రెస్‌ కీలక సమావేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

ఈనెల 4న కాంగ్రెస్‌ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులతో ఎల్బీస్టేడియంలో కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. దేశ వ్యాప్తంగా ‘జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌’ కార్యక్రమంలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే గ్రామ శాఖ అధ్యక్షులతో నేరుగా మాట్లాడుతారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశం పార్టీ చరిత్రలో గొప్పగా నిలిచిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఖర్గే ఇచ్చే సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు చేరవేయాలని గ్రామ శాఖ అధ్యక్షులకు సూచించారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకత్వం కృషి చేయాలని కోరారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ చేపట్టిన జై సంవిధానం కార్యక్రమం మన రాష్ట్రంలో విజయవంతంగా సాగుతోందని ఆయన పేర్కొన్నారు.
వైద్యుల సేవలు అమూల్యమైనవి : మహేశ్‌కుమార్‌గౌడ్‌
రోగులకు వైద్యులు చేస్తున్న సేవలు ఎంతో అమూల్యమైనవని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌ పేర్కొన్నారు. ప్రతి ప్రాణానికి వైద్యులు అండగా నిలిచే ప్రాణదాతలు అని పేర్కొన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, సేవా దృక్ఫథంలో రోగులకు నిస్వార్థ సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. డాక్టర్‌ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జూనియర్‌ డాక్టర్లకు 15 శాతం స్టైఫండ్‌ పెంచడంతోపాటు సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్ల గౌరవ వేతనాన్ని పెంచిందని ఆయన గుర్తు చేశారు.
జర్నలిస్టు శివకుమార్‌, బీవీ పట్టాభిరామ్‌ల మృతికి మహేశ్‌ సంతాపం
దశాబ్దాల కాలంపాటు జర్నలిస్టుగా పని చేసిన శివకుమార్‌ ఆకస్మికంగా మృతి చెందడం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్‌ బీవీ. పట్టాభిరామ్‌ మృతి పట్ల మహేశ్‌ సంతాపం వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన మృతి దేశానికి, రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -