- Advertisement -
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
ఆదిలాబాద్ విద్యాశాఖ అధికారిగా కుష్బూ గుప్తా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు డీఈఓ గా శ్రీనివాస్ రెడ్డి విధులు నిర్వర్తించారు. ఆయనను తప్పిస్తూ ఐటీడీఏ పిఓ కుష్బూ గుప్తా ను డీఈఓ గా నియమిస్తూ ఇటీవల ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు మంగళవారం డీఈఓ గా బాధ్యతలు స్వీకరించగా కార్యాలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఐ ఏఎస్ అధికారి డీఈఓ గా రావడంతో విద్యాశాఖ గాడిన పడుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -