కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
ఒట్టాంగ్(కెనడా): కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. కిదాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా.. సుబ్రమణియన్ క్వార్టర్‌ఫైనల్లో ఓటమిపాలయ్యాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ 21-18, 21-9తో ఛౌ-టిన్-చెన్(చైనీస్ ఐపీ)ని చిత్తుచేసి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఇక సుబ్రమణియన్ మూడుసెట్ల హోరాహోరీపోరులో తనకంటే మెరుగైన ర్యాంక్ ఆటగాడైన జపాన్‌కు చెందిన నిషిమోటో చేతిలో ఓటమిపాలయ్యాడు. హోరాహోరీగా సాగిన ఆ పోటీలో సుబ్రమణియన్ 15-21, 21-5, 17-21తో పరాజయాన్ని చవిచూశాడు. సెమీస్‌లో కిదాంబి శ్రీకాంత్.. నిషిమోటోతో తలపడనున్నాడు.
సెమీస్‌కు కిదాంబి శ్రీకాంత్
- Advertisement -
- Advertisement -