నవతెలంగాణ-హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం వార్డెన్ కిషన్ నాయక్ విచక్షణ మరిచారు. విద్యార్థులు తనపై ఫిర్యాదు చేశారనే కోపంతో రగిలిపోయాడు. వసతి గృహం సిబ్బందికి ఫోన్ చేసి.. ‘నా మీదనే ఫిర్యాదు చేస్తారా? వాళ్ల అన్నంలో విషం కలిపి చంపేయండి’ అంటూ హుకుం జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్పందించారు. వార్డెన్ కిషన్ నాయక్‌ను సస్పెండ్ చేస్తూ అదేశాలు జారీ చేశారు.
నా మీదనే ఫిర్యాదు చేస్తారా విషం పెట్టి చంపేయ్ అందరిని..!!
— Telugu Scribe (@TeluguScribe) January 3, 2026
ఎస్సీ గురుకుల విద్యార్థులకు విషం పెట్టి చంపేయమని వంట మనిషికి వార్డెన్ ఆదేశాలు
ఇటీవల 10 రోజులుగా స్కూల్లో కరెంట్ లేదని, వార్డెన్ తాగి వచ్చి బూతులు తిడుతున్నాడని రోడ్డుపై బైఠాయించిన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ఎస్సీ… pic.twitter.com/YQpfaYUA8i
వార్డెన్ కిషన్ నాయక్ తీరుతో విసిగిపోయిన వసతి గృహంలోని విద్యార్థులు గురువారం రాత్రి రోడ్డెక్కారు. కడ్పల్-సిర్గాపూర్ రహదారిపై బైఠాయించి వార్డెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న స్థానిక ఎస్సై మహేశ్, సర్పంచి శ్రీనివాసరావు విద్యార్థులకు నచ్చజెప్పారు. వసతి గృహానికి వచ్చిన ఏఎస్ డబ్ల్యూవో చందా శ్రీనివాస్‌కు వార్డెన్ తీరుపై ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న కిషన్ నాయక్… శుక్రవారం ఉదయం మద్యం మత్తులో వసతి గృహానికి వచ్చి పిల్లలను అసభ్య పదజాలంతో దూషిస్తూ రెచ్చిపోయారు. వసతి గృహం సిబ్బందికి ఫోన్ చేసి అన్నంలో విషం కలిపి విద్యార్థులను చంపేయమని హుకుం జారీ చేశారు. ఈ ఫోన్ సంభాషణ బయటికి రావడంతో కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.



