Wednesday, July 30, 2025
E-PAPER
Homeసినిమాఘనంగా 'కింగ్‌డమ్‌' ప్రీ రిలీజ్‌

ఘనంగా ‘కింగ్‌డమ్‌’ ప్రీ రిలీజ్‌

- Advertisement -

విజయ్‌ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే సత్యదేవ్‌, వెంకటేష్‌ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘కింగ్‌డమ్‌’. గౌతమ్‌ తిన్ననూరి దర్శకుడు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకను మేకర్స్‌ ఘనంగా నిర్వహించారు. విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ, ‘మనసులో కొంచెం భయం ఉంది. అదే సమయంలో ఓ మంచి సినిమా చేశామనే సంతప్తి ఉంది. ఈ సినిమా అవుట్‌ పుట్‌ పట్ల టీమ్‌ అందరం సంతోషంగా ఉన్నాం. అభిమానులు నాకు దేవుడిచ్చిన వరం. సినిమాలు హిట్‌ అయినా, ఫ్లాప్‌ అయినా.. అదే ప్రేమ, అదే నమ్మకం నాపై చూపిస్తున్నారు. నా విజయాన్ని చూడాలని మీరు కోరుకుంటున్నాను. మీ కోసం ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాను. మీరందరూ నా నుంచి కోరుకుంటున్న హిట్‌ ఈ సినిమాతో రాబోతుంది. ఇది విజరు దేవరకొండ ‘కింగ్‌డమ్‌’ కాదు.. గౌతమ్‌ తిన్ననూరి ‘కింగ్‌డమ్‌” అని చెప్పారు.
‘ఈ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. విజరుకి ఈ సినిమా పెద్ద సక్సెస్‌ తీసుకురావాలి. మనలోని నటనని రాబట్టుకోవడంలో దర్శకుడు గౌతమ్‌ తనకు తానే సాటి’ అని సత్యదేవ్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -