Sunday, July 27, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ ట్రైలర్‌..

విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ ట్రైలర్‌..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్‌డమ్ మూవీ ట్రైలర్ విడుదలైంది. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంపై ట్రైలర్ హైప్ పెంచింది. ముఖ్యంగా అన్నదమ్ముల సెంటిమెంట్‌ను ఈ చిత్రంలో ప్రత్యేకంగా చూపిస్తున్నట్లు కనిపిస్తున్నది. జెర్సీ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్ యువ నటుడు సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో ట్రైలర్‌ విడుదల వేడుకను నిర్వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -