నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని కిసాన్ నగర్ గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్ గా ఏనుగుల రామ్ రాజ్ గౌడ్,ఉప సర్పంచ్ చిలువేరి స్వామినాథ్, వార్డ్ సభ్యులుగా గుజ్జేటి నరసయ్య, ఐరా సాయినాథ్, పెసరి లావణ్య, బొంత లావణ్య, మొహమ్మద్ హమీద్, ఎనుగందుల సమత, బైండ్ల సుకన్య, అంబే వార్ మోతిరామ్, రాంపల్లి సుమలత, ఐలాపూర్ శ్రీనివాస్, మ్యాక లక్ష్మీనారాయణ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు దాసరి వెంకటేష్, షేక్ రహీముద్దీన్, శరత్, గ్రామపంచాయతీ కార్యదర్శి రేణుక దేవి తదితరులు పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకారం చేసిన కిసాన్ నగర్ నూతన పాలకవర్గం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



