కేసీఆర్‌కు గురుదక్షిణ కింద
బీజేపీ అభ్యర్థి బలి
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు
ఇది కాదా పరస్పర సహకారం : రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డికి చాలెంజ్ చేస్తున్నా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలువబోతున్నది’ అని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అని నొక్కి చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మరోమంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ చేసిన సహాయానికి గురుదక్షిణగా బీజేపీ అభ్యర్థిని కిషన్‌రెడ్డి బలిస్తున్నారని ఆరోపించారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 80,549, కాంగ్రెస్ అభ్యర్థికి 64,212, బీజేపీకి 25,866 ఓట్లు పడ్డాయనీ, అదే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికి ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు 89,705 ఓట్లు, బీజేపీకి 64,673 ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 18,405 ఓట్లు వచ్చాయని గణాంకాలతో వివరించారు. శాసన సభ ఎన్నికల్లో బీజేపీ 25 వేల ఓట్లు సాధిస్తే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అదే శాసభ సభ నియోజకవర్గం నుండి 64 వేల ఓట్లు ఎలా వచ్చాయి? ఇది పరస్పర సహకారం కాదా? అని నిలదీశారు. ఎన్నికల ఫలితాల వెబ్‌సైట్‌ను చూస్తే బీజేపీ-బీఆర్‌ఎస్ పార్టీలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పరస్పరం సహకరించు కుంటున్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతున్నదన్నారు.
కిషన్‌రెడ్డీ.. జూబ్లీహిల్స్‌లో గెలుపు మాదే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



