Thursday, December 11, 2025
E-PAPER
Homeఆటలుకోహ్లి, రోహిత్‌ ర్యాంకింగ్స్‌ మెరుగు…

కోహ్లి, రోహిత్‌ ర్యాంకింగ్స్‌ మెరుగు…

- Advertisement -

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ప్రకటించిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లి, స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ తమ తమ ర్యాంకింగ్స్‌ను మెరుగు పరుచుకున్నారు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్‌ కోహ్లి(773 పాయింట్లు) 2వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. మరోవైపు రోహిత్‌ శర్మ(781) తన టాప్‌ ర్యాంక్‌ను పదిలం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో విరాట్‌ కోహ్లి రెండు సెంచరీలు, ఒక అర్ధసెంచరీతో రాణించడంతో అతని ర్యాంక్‌ మెరుగైంది. దీంతో టాప్‌ ర్యాంక్‌కు చేరుకునేందుకు కేవలం 8 రేటింగ్‌ పాయింట్ల దూరంలో ఉన్నాడు. ఒక టీమిండియా మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో 146పరుగులతో రాణించాడు. దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌-2లో ఇద్దరూ భారత బ్యాటర్లే నిలవడం విశేషం.

ఇక టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ 5వ స్థానంలో, శ్రేయస్‌ అయ్యర్‌ ఒక ర్యాంక్‌ పడిపోయి 10వ స్థానంలో నిలిచాడు. కెఎల్‌ రాహుల్‌ మూడు ర్యాంక్‌లు మెరుగుపరుచుకొని 12వ స్థానంలో నిలువగా.. బౌలర్ల విభాగంలో కుల్దీప్‌ యాదవ్‌ మూడు ర్యాంక్‌లు మెరుగుపరుచుకొని మూడోస్థానానికి ఎగబాకాడు. ఇక టీమిండియా టెస్ట్‌ బ్యాటర్ల జాబితాలో యశస్వి జైస్వాల్‌(750) ఒక్కడే టాప్‌-10లో నిలిచాడు. శుభ్‌మన్‌ 11వ, రిషబ్‌ పంత్‌ 13వ స్థానాలో కొనసాగుతున్నారు. బౌలర్ల జాబితాలో బుమ్రా మరోసారి టాప్‌ ర్యాంక్‌కు ఎగబాకాడు. సిరాజ్‌, జడేజా, కుల్దీప్‌ ఒక్కో స్థానం మెరుగుపరుచుకొని 12వ, 13వ, 14వ స్థానాల్లో ఉన్నారు. ఇక దక్షిణాఫ్రియా సంచలన బౌలర్‌ యాన్సెన్‌ భారత్‌తో టెస్ట్‌ సిరీస్‌లో 18వికెట్లు తీసి తొలిసారి కెరీర్‌ బెస్ట్‌ 3వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక టి20 బ్యాటర్ల జాబితాలో అభిషేక్‌ శర్మ(913 రేటింగ్‌ పాయింట్లు) అగ్రస్థానంలోనే ఉన్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -