స్వచ్ఛత, అభివృద్ధి, పారదర్శక పాలన మా హామీ..
తాటిపాముల గ్రామం ముందుకు సాగాలంటే కలిసి గెలుద్దాం.!
సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి కోల రమేష్ గౌడ్
నవతెలంగాణ – వెబ్ డెస్క్
తాటిపాముల గ్రామం మరింత ముందుకు సాగాలంటే ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని రమేశ్ గౌడ్ పిలుపునిచ్చారు. యువతకు అవకాశాలు, మహిళలకు భద్రత, రైతులకు సాయం, వృద్ధులకు ఆదరణ, ప్రతి వర్గానికి చేయూత అందించే గ్రామ పాలన అవసరమని తెలిపారు. గ్రామ అభివృద్ధే నా ఏకైక అజెండాతో అభ్యర్ధిగా బరిలో నిలిచానని స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధి కోసం తాను రూపొందించిన ప్రణాళికలను ప్రజల ముందుకు తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు.
పంచాయతీ నిధుల పారదర్శక వినియోగం, శుద్ధి నీరు, శుభ్రమైన గ్రామం, యువతకు క్రీడావేదికలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, మహిళల కోసం స్వయం సహాయక వనరుల బలోపేతం, రైతులకు కాలానుగుణ సాయం, వ్యవసాయ అవసరాలపై త్వరిత స్పందన ఇలా అనేక అంశాలపై కేంద్రీకరించి పనిచేస్తానని తెలిపారు. తాటిపాముల అభివృద్ధి కోసం వస్తున్న ఆశీర్వదించి, కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్బంగా కోరారు.వె



