- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆత్మకూరు (ఎం ) మండలంలో నిర్వహించిన ఆరుట్ల కమలాదేవి–రామచంద్రారెడ్డి స్మారక ఆలేరు నియోజకవర్గస్థాయి క్రీడోత్సవాల్లో భాగంగా జరిగిన కబడ్డీ పోటీల్లో కొలనుపాక టీం మొదటి బహుమతిని సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోటీల్లో ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం చూపిన కొలనుపాక ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో విజేతలుగా నిలిచారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు విజేత జట్టును అభినందించి బహుమతులు అందజేశారు.క్రీడల ద్వారా యువతలో క్రీడాస్ఫూర్తి, ఐక్యత పెరుగుతాయని పలువురు వక్తలు పేర్కొన్నారు.
- Advertisement -



