- Advertisement -
వాంఖడెలో అగ్ర జట్ల సమరం
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ టైటిల్ వేటను మాజీ చాంపియన్లు నేడు మొదలు పెట్టనున్నాయి. ఐదుసార్లు చాంపియన్ ముంబయి ఇండియన్స్‌తో మూడు సార్లు చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ నేడు తలపడనుంది. హార్దిక్ పాండ్య సారథ్యంలోని సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రోహిత్ శర్మ, జశ్‌ప్రీత్ బుమ్రా వంటి మేటి ఆటగాళ్లు ముంబయి తరఫున మెరిసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ నాయకత్వంతో పాటు ఫైర్ పవర్ కోల్పోయిందనే విమర్శలకు నేడు తొలి మ్యాచ్‌లోనే సమాధానం ఇవ్వాలనే ఆలోచనలో కనిపిస్తోంది. నేడు వాంఖడె స్టేడియంలో ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ఆరంభం.
- Advertisement -



