Friday, October 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర స్థాయిలో నెట్ బాల్ పోటిల్లో ప్రతిభా చాటిన కోన సముందర్ విద్యార్థిని

రాష్ట్ర స్థాయిలో నెట్ బాల్ పోటిల్లో ప్రతిభా చాటిన కోన సముందర్ విద్యార్థిని

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని వి. సంధ్య రాష్ట్ర స్థాయి నెట్ బాల్ క్రీడ పోటిల్లో ప్రతిభా చాటినట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రమేష్ గౌడ్ తెలిపారు. ఈనెల 10వ తేదీ నుంచి 12వ తేద వరకు మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన 7వ రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీల జూనియర్ విభాగంలో పాఠశాల విద్యార్థిని వి.సంధ్య అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు ఆయన తెలిపారు.33 జిల్లాల నుండి  పలువురు విద్యార్థులు  రాష్ట్ర స్థాయిలో నెట్ బాల్ క్రీడా పోటిల్లో  కోన సమందర్ పాఠశాలకు చెందిన వి.సంధ్య అత్యంత ప్రతిభా కనబరిచి, నిజామాబాద్ జిల్లా తృతీయ స్థానం సాధించడంలో కీలకపాత్ర పోషించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థిని వి.సంధ్య, ఫిజికల్ డైరెక్టర్ రమేష్ గౌడ్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. మధుపాల్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మెల్ల గంగాధర్, సభ్యులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు,  ఉపాధ్యాయుల బృందం సభ్యులు అభినందించారు. విద్యార్థిని సంధ్య భవిష్యత్తులో క్రీడల్లో మరింతగా రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -